Muni Kanna Look Released from Narappa movie: నారప్ప మూవీ నుండి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట‌ర్ రిలీజ్!

Muni Kanna Look Released from Narappa movie: నారప్ప మూవీ నుండి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట‌ర్ రిలీజ్!
x
Highlights

Muni Kanna Look Released from Narappa movie: గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ చిత్రలలతో మంచి సక్సెస్ అందుకున్నాడు సీనియర్ హీరో వెంకటేష్

Muni Kanna Look Released from Narappa movie: గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ చిత్రలలతో మంచి సక్సెస్ అందుకున్నాడు సీనియర్ హీరో వెంకటేష్ ... ప్రస్తుతం తమిళ్ లో ధనుష్ , మంజు వారియర్ కలిసి నటించిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవడం, వెంకటేష్ దీనిని రీమేక్ చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రతీకార కథాంశంతో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంలో మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్‌ నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాతలు అయిన సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిమిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తోంది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి లుక్స్ విడుద‌ల కాగా, తాజాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్ విడుద‌ల చేశారు. ఈ పాత్రలో కార్తీక్ ర‌త్నం నటిస్తున్నాడు. ఈ రోజు కార్తీక్ ర‌త్నం పుట్టిన రోజు సందర్భంగా ఆయనకీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం..ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ చేయనున్నారు. ఇందులో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఎఫ్2 సినిమాని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories