Balakrishna with Prabhu Deva: ట్రెండ్ అవుతున్న బాలయ్య, ప్రభుదేవా పిక్ !

Balakrishna with Prabhu Deva: మూడు నెలల లాక్ డౌన్ సమయంలో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు నెటిజన్లు ..

Krishna
Published on: 4 July 2020 2:42 PM IST
Balakrishna with Prabhu Deva: ట్రెండ్ అవుతున్న బాలయ్య, ప్రభుదేవా పిక్ !
X

Balakrishna with Prabhu Deva: మూడు నెలల లాక్ డౌన్ సమయంలో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు నెటిజన్లు .. ఆ పాత జ్ఞాపకాలే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతున్నాయి. ఇప్పటికే టీనేజ్ లో ఎన్టీఆర్ భరతనాట్యం వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే... తాజాగా నటసింహం బాలకృష్ణతో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేస్తున్న ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నందమూరి అభిమానులు కూడా ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఇది ధర్మక్షేత్రం సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక ప్రభుదేవా డాన్స్ కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా ఆ తరవాత దర్శకుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకి దర్శకత్వం వహించిన ప్రభుదేవా ప్రస్తుత్తం బాలీవుడ్ లో బిజీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు ఎంత ఘనవిజయం సాధించయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న నేపధ్యంలో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో అందరిని ఆకట్టుకుంది. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు.


Krishna

Krishna

Next Story