Uppena movie releasing in theaters : వెండితెర పైనే మెగా హీరో సినిమా!

Uppena movie releasing in theaters : లాక్ డౌన్ వలన బాగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా మళ్ళీ పుంజుకుంటుంది

Krishna
Updated on: 4 July 2020 10:45 PM IST
Uppena movie releasing in theaters : వెండితెర పైనే మెగా హీరో సినిమా!
X

Uppena movie releasing in theaters : లాక్ డౌన్ వలన బాగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీ మెల్లిమెల్లిగా మళ్ళీ పుంజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా బుల్లితెర, వెండితెరకి సంబంధించిన షూటింగ్ లు మళ్ళీ పట్టాలేక్కుతున్నాయి. ఇక ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు హీరోగా నటించిన కృష్ణ అండ్ హీజ్ లీలా, భానుమతి & రామకృష్ణ సినిమాలు మొదలగు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.

ఈ నేపధ్యంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఉప్పెన' చిత్రంలో ఓటీటీలో రిలీజ్ అవుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే...అయితే ఈ సినిమాలో నటిస్తున్న వైష్ణవ్‌ తేజ్‌ కొత్త హీరో కావడం, మళ్ళీ మెగా కాంపౌండ్‌ నుంచి వస్తున్న మరో నట వారసుడు కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో సినిమాని వెండితెర పైనే విడుదల చేయాలనే నిర్మాతలు నిర్ణయించారు. సినిమా విడుదల ఆలస్యమైనప్పటికి ఈ చిత్రాన్ని మాత్రం ఖచ్చితంగా థియేటర్‌లో విడుదల చేస్తామని అంటున్నారు చిత్ర నిర్మాతలు...

ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేశాయి. కరోనా వల్ల వాయిదా పడిన షూటింగ్ మళ్ళీ పట్టాలేక్కింది. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story