12 O clock Teaser : భయపెడుతున్న వర్మ "12 ఓ క్లాక్" టీజర్

12 O clock Teaser రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడో సినిమా స్టార్ట్ చేస్తాడో, ఎప్పుడో కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు.. ఓ ముహూర్తపు షాట్ ఉండదు.

Krishna
Published on: 3 July 2020 11:00 PM IST
12 O clock Teaser : భయపెడుతున్న వర్మ 12 ఓ క్లాక్ టీజర్
X
12 “o” CLOCK Movie Teaser

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడో సినిమా స్టార్ట్ చేస్తాడో, ఎప్పుడో కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు.. ఓ ముహూర్తపు షాట్ ఉండదు. అయిపోయాక గుమ్మడికాయ కొట్టడం ఉండదు. డైరెక్ట్ గా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేస్తాడు. బహుశా ఇలా ఎవరు ఉండేరేమో.. అదంతే వర్మ స్టైల్ అనుకోవడమే.. ఇప్పటికే అరడజన్ సినిమాలను అనౌన్స్ చేసిన వర్మ తాజాగా మరో సినిమాని చేస్తున్నట్టుగా చెప్పేశాడు. పనిలో పనిగా టీజర్ కూడా బయటికి వదిలాడు.

ప్రేక్షకులను భయపెట్టి చాలా రోజులైంది అనుకున్నాడో ఏమో కానీ ఇప్పడు ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని అనౌన్స్ చేశాడు. గతంలో 'రాత్రి ', 'భూత్' వంటి హారర్ చిత్రాలను తెర‌కెక్కించిన వర్మ ప్రస్తుతం వాటిని పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం కరోనాతో జనాలు భయపడుతుంటే నేను సినిమాతో భయపెడతాను అంటూ ''12 O క్లాక్'' టీజర్ వదిలాడు. విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

టీజర్ లో హారర్ ఎపిసోడ్స్, నేపధ్య సంగీతం బాగున్నాయి. ఈ '12 ఓ క్లాక్‌' మూవీని కంపెనీ ప్రొడ‌క్షన్‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తుండ‌గా, ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కాదని 1 గంట 45 నిముషాలు ఉండే ఫుల్ లెన్త్ సినిమా అని చెప్పుకొచ్చాడు.

ఇక లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలని పక్కన పెడితే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలను తెరకెక్కించి రిలీజ్ చేశాడు. అందులో భాగంగానే 'క్లైమాక్స్, నగ్నం సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో ప్రేక్షకుల మీదికి వదిలాడు. ఇక మర్డర్, పవర్ స్టార్ సినిమాలను త్వరలొనే రిలీజ్ చేయనున్నాడు వర్మ.



Krishna

Krishna

Next Story