తలైవా రజనీకాంత్ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి టైటిల్!

తలైవా రజనీకాంత్ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి టైటిల్!
x
Highlights

సినిమా విషయంలో టైటిల్ కుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక సినిమా విడుదలకు ముందే అందరి నోళ్ళలోనూ నానాలంటే టైటిల్ సరైనది అయివుండాల్సిందే. దర్శకుడు...

సినిమా విషయంలో టైటిల్ కుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక సినిమా విడుదలకు ముందే అందరి నోళ్ళలోనూ నానాలంటే టైటిల్ సరైనది అయివుండాల్సిందే. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు టైటిల్ తోనే సగం హైప్ వచ్చేస్తుంది. ఇక టైటిల్ తోనే విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోలు కూడా తమ సినిమాకి మంచి టైటిల్ ఉండాల్సిందే అని పట్టుపడతారు. అభిమానులు కూడా ఆ హీరోల సినిమాల టైటిల్స్ కు విపరీతంగా కనెక్ట్ అవుతారు. దానికి తాజా ఉదాహరణ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు.. బన్నీ అల వైకుంఠపురములో.. సాయిధరం తేజ్ ప్రతిరోజూ పండగే.. ఇక చిరంజీవి సైరా.. ఖైదీ నెంబర్ 150 ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో సినిమాలు టైటిల్ తోనే సగం విజయాన్ని సాధించేశాసయని చెప్పొచ్చు.

ఇప్పుడు తలైవా రజనీకాంత్ తాజా సినిమాకి టైటిల్ కోసం విపరీతంగా మల్లాగుల్లాలు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..రజనీ ఇటీవల చేసిన సినిమాలు అనుకున్న రేంజిలో హిట్ కాలేదు. ముఖ్యంగా తెలుగులో రజనీ ఫాలోయింగ్ కు తగ్గ కలెక్షన్లు రాబత్తలేకపోయాయి. దీంతో రజనీ సినిమాలకు తెలుగు టైటిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారట. అందులో భాగంగా రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రానికి మెగాస్టార్ టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్. ఇప్పటికే మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా టైటిల్స్ ని తమిళ హీరోలు విచ్చల విడిగా వాడేసి ఆ టైటిల్ సెంటిమెంట్తో ప్రేక్షకులను ఆకర్షించారు. కార్తీ.. ఖైదీ టైటిల్ ను స్వంతం చేసుకుని హిట్ కొట్టేశాడు. ఇక హీరో విజయ్ కూడా తన తాజా సినిమాకి మాస్టర్ అని టైటిల్ పెట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు. ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టు ఉందని భావిస్తున్న రజనీ నిర్మాతలు మెగాస్టార్ టైటిల్ తో తాజా చిత్రాన్ని తెలుగులో వదలాలని చూస్తున్నారట. ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏమిటో తెలుసా 'అన్నయ్య'

రజనీకాంత్ హీరోగా కళానిధి మారన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆ సినిమాకి తమిళంలో అన్నాతే అంటే అన్నయ్య అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదే సినిమా ఎలానూ తెలుగులో డబ్బింగ్ వదులుతారు కదా.. దానికి అన్నయ్య అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఎందుకంటే ఆ టైటిల్ తో వచ్చిన చిరంజీవి సినిమా సూపెర్ హిట్. అదీకాకుండా..మెగాస్టార్ చిరంజీవి సరైన హిట్ లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ అన్నయ్య సినిమా వచ్చి హిట్ తెచ్చింది. ఆ సెంటిమెంట్ రజనీకి కూడా వర్కౌట్ అవుతుందని దర్శక నిర్మాతలు గట్టిగా భావిస్తున్నారట. అందుకే తమిళంలోనూ అదే అర్థం వచ్చేలా టైటిల్ పెట్టారని అంటున్నారు. అంతే కాదు తలైవా రజనీ పొలిటికల్ ఎంట్రీకి సపోర్ట్ గా ఉండేలా సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ నేపద్యంలో అన్నయ్య అనే టైటిల్ కరక్ట్ గా సరిపోతుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద మెగాస్టార్ టైటిల్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తున్నరన్నమాట!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories