'మన్మధుడు' సీక్వెల్ అధికారిక లాంచ్ కోసం ముహూర్తం ఫిక్స్

ఇప్పటిదాకా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమాతో...
ఇప్పటిదాకా హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ మధ్యనే సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారాడు. గత కొంతకాలంగా రాహుల్ రవీంద్రన్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తో ఒక సినిమా చేయనున్నారని, ఈ సినిమా నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా అయిన 'మన్మధుడు' కి సీక్వెల్ గా తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలో నిజం లేక పోలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అధికారికంగా త్వరలో లాంచ్ చేయనున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
మార్చ్ 12 న సినిమా అధికారికంగా లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. సినిమా షూటింగ్ మొత్తం యూరోప్లో జరగనుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కూడా అక్కడే జరుగుతుందట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగార్జున విజయ భాస్కర్ దర్శకత్వంలో నటించిన 'మన్మధుడు' సినిమా తెలుగులో క్లాసిక్గా నిలిచిన సినిమా. రాహుల్ ఈ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMTరథం తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురి మృతి
28 May 2022 10:25 AM GMT