షూటింగ్ పూర్తి చేసుకున్న "లైగర్" బృందం

Liger Movie Shooting Ends
x

షూటింగ్ పూర్తి చేసుకున్న "లైగర్" బృందం

Highlights

Liger Movie: ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కి ఒక్క హిట్ కూడా పడలేదు.

Liger Movie: ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కి ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలోనే తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "లైగర్" పైనే పెట్టుకున్నాడు ఈ యువ హీరో. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. అనన్య పాండే కి తెలుగు లో ఇది మొదటి సినిమా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ 2020లో మొదలైంది కానీ కరోనా కారణంగా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఈ మధ్యనే ఆఖరి షెడ్యూల్ మొదలు పెట్టిన చిత్రబృందం తాజాగా సినిమా షూటింగ్ని పూర్తి చేసింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమే కాక పూరి అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో వీరు ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories