Kiara Advani In Prabhas Movie : ప్రభాస్ సినిమాలో సీతగా కీయరా?

Kiara Advani In Prabhas Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ

Krishna
Published on: 25 Aug 2020 10:53 AM IST
Kiara Advani In Prabhas Movie : ప్రభాస్ సినిమాలో సీతగా కీయరా?
X

Kiara Advani ,Prabhas

Kiara Advani In Prabhas Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు ప్రభాస్... ఇది ప్రభాస్ కి 22 వ సినిమా... ఈ సినిమాకి 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందనుందని సమాచారం.. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొన్నటివరకు ప్రభాస్ సరసన సీత పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ ప్లేస్ లో బాలీవుడ్ భామ కీయరా అద్వానీ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ లో కీయరా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక టాలీవుడ్ లోను ఈ భామ భరత్ అను నేను, వినయ విధేయ రామ చిత్రాలలో నటించింది.

ఈ చిత్రంలో ప్రతినాయ‌కుడు రావ‌ణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నారని, ఆ పాత్రలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ న‌టించ‌నున్నార‌ని ప్రచారం జ‌రుగుతుంది. దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం 'తానాజీ'లో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడైన ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్ర పోషించి.. విమ‌ర్శకుల ప్రశంస‌లు పొందారు. అందుకే, రావణుడి పాత్రకు ఆయనైతే న్యాయం చేయగలరని ఓం రౌత్ భావించారట. సైఫ్ కూడా ఈ పాత్రకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా వేయి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Krishna

Krishna

Next Story