Justice For Hathras Victim : వారిని బహిరంగంగా కాల్చండి... ఉత్తరప్రదేశ్ ఘటన పైన కంగనా

Justice For Hathras Victim : వారిని బహిరంగంగా కాల్చండి... ఉత్తరప్రదేశ్ ఘటన పైన కంగనా
x

Kangana Ranaut, Richa Chadha

Highlights

Justice For Hathras Victim : ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన పైన బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్ , రిచా చద్దా , స్వరా భాస్కర్, యామి గౌతమ్ తదితరలు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Justice For Hathras Victim : ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన పైన బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్ , రిచా చద్దా , స్వరా భాస్కర్, యామి గౌతమ్ తదితరలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. " ప్రతి సంవత్సరం పెరిగిపోతున్న ఈ సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏంటి?.. ఈ దేశానికి ఎంతో విచారకరమైన, సిగ్గుపడే రోజు ఇది. ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయండి. మన కుమార్తెల వైఫల్యం మనకు సిగ్గుచేటు" అంటూ కంగనా ట్వీట్ చేసింది.

" ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి అర్హులే. నేరస్థులను శిక్షించండి. "అంటూ రిచా చద్దా ట్వీట్ చేసింది.


రియా చక్రవర్తి మరియు దీపికా పదుకొనేలపై రాత్రి పగలు బ్రేకింగ్ న్యూస్ నడుపుతున్న టీవీ ఛానెల్స్ హత్రాస్ భాదితురాలుకి న్యాయం జరిగేలా వార్తలను నడుపుతుందా? అని ఓ నెటిజన్ హిందీలో అడిగగా, దానికి స్వరా భాస్కర్ హిందీలో "నహిన్ (లేదు)" అని ట్వీట్ చేసింది.


నా దుఖం, కోపం మరియు అసహ్యాన్ని వ్యక్తపరిచే ముందు నా ఆలోచనలను సేకరించడానికి చాలా ప్రయత్నించాను.. 2020 ఇంకా చాలా మంది నిర్భయలు తమ ప్రాణాలను అర్పించాల్సి వస్తోంది.. భాదితురాలు భరించిన బాధను ఆమె కుటుంబాన్ని ఉహించాలేకపోతున్నాను.. నిందితులలో కఠినమైన శిక్ష వేయాలని, న్యాయం కోసం ప్రార్థిస్తున్నాను" అని యామి గౌతమ్ ట్వీట్ చేశారు.


ఉత్తరప్రదేశ్ లో పశువుల మేత కోసం అడవికి వెళ్ళిన 19 ఏళ్ల యువతి పైన మానవ మృగాలు పైశాచికత్వం చూపించాయి. యువతిని నిర్భందించి సాముహిక అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందో ఏమో అని భయంతో యువతి నాలుకను కోసేశారు. దీనితో తీవ్ర రక్తస్త్రావానికి గురైనా భాదితురాలు ఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలను విడిచింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపైన యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories