దారుణం.. యూపీ అత్యాచార ఘటనలో యువతి మృతి!

దారుణం.. యూపీ అత్యాచార ఘటనలో యువతి మృతి!
x
Highlights

Uttar Pradesh Victimized Teen Passed Away : దిశ లాంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ మహిళల పైన అత్యాచారాలు ఏ మాత్రం తగ్గడం లేదు.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.

Uttar Pradesh Victimized Teen Passed Away : దిశ లాంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ మహిళల పైన అత్యాచారాలు ఏ మాత్రం తగ్గడం లేదు.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. పశువుల మేత కోసం అడవికి వెళ్ళిన 19 ఏళ్ల యువతి పైన మానవ మృగాలు పైశాచికత్వం చూపించాయి. యువతిని నిర్భందించి సాముహిక అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందో ఏమో అని భయంతో యువతి నాలుకను కోసేశారు.


దీనితో తీవ్ర రక్తస్త్రావానికి గురైనా భాదితురాలు ఢిల్లీ లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలను విడిచింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ గ్రామంలో చోటుచేసుకుంది. దీనిపైన యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అటు నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


అయితే ఈ ఘటన పైన ఉత్తరప్రదేశ్ పోలీసులు మొదట్లో తమకు సహాయం చేయలేదని, ప్రజల ఆగ్రహం తర్వాత మాత్రమే స్పందించారని బాధితురాలు కుటుంబం ఆరోపిస్తుంది. అయితే ఆ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. ఈ ఘటన పైన కుటుంబ సభ్యులు నెమ్మదిగా స్పందించారని పోలీసులు అంటున్నారు. సందీప్, రాము, లవ్కుష్, రవి లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 14 న యువతి పై అత్యాచారం జరిగింది.

ఈ ఘటన పైన యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పందించారు.. " ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా విచారకరం. మా ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి అండగా నిలుస్తుంది. దీనిపైన దర్యాప్తు ప్రారంభమైంది.. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశాం.. వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం.. " అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories