కంగనాకు సమన్లు ఎందుకివ్వలేదు?: నగ్మా ఫైర్

కంగనాకు సమన్లు ఎందుకివ్వలేదు?: నగ్మా ఫైర్
x

Kangana Ranaut, Nagma 

Highlights

Nagma Asks : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాను కూడా డ్రగ్స్ కి బానిస అయినట్టుగా చెప్పిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో

Nagma Asks : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాను కూడా డ్రగ్స్ కి బానిస అయినట్టుగా చెప్పిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. మార్చి నెలలో కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన స్వస్థలమైన మనాలిలో ఉన్నప్పుడు కంగనా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో కంగనా మాట్లాడుతూ.. " నటిని కావాలన్న ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయి ముంబైకి వచ్చాను.. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ అయ్యాను.. అంతేకాకుండా డ్రగ్స్‌కి బానిసయ్యాను. నేను యుక్తవయసులో ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను చాలా మంది చెడ్డవ్యక్తులతో ఇబ్బంది పడ్డాను" అని కంగనా అందులో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను మీరు కూడా డ్రగ్స్‌ తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇదే విషయం పట్ల సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ఫైర్ అయ్యారు. కంగనా డ్రగ్స్‌కి బానిసయ్యానని స్వయంగా చెప్పినప్పటికీ ఎన్సీబీ అధికారులు ఆమెకు సమన్లు ఎందుకు ఇవ్వలేదని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఎన్సీబీ తీరుపై నిప్పులు చెరిగారు. " వాట్సాప్‌ మెసేజ్ ల ఆధారంగా కొంతమంది సెలబ్రిటీలకి మన్లు జారీ చేసినప్పుడు..స్వయంగా డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పిన కంగనా రనౌత్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు ఎందుకు ఇవ్వలేదు.. సెలబ్రిటీల సమాచారాన్ని పత్రికలకు అందచేసి వారిని ప్రజల్లో అపఖ్యాతి పాలుచేయడం ఎన్సీబీ విధా? ఇది నిజంగా విచారకరమైన విషయం" అంటూ ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, దీపికా పదుకొణె, దియా మీర్జా.. వీళ్లంతా గతంలో బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారని.. అందుకే వారిని ఈవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ నగ్మా కొన్ని ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.Show Full Article
Print Article
Next Story
More Stories