logo
సినిమా

బాలీవుడ్లో అడుగు పెట్టనున్న స్టార్ హీరో

బాలీవుడ్లో అడుగు పెట్టనున్న స్టార్ హీరో
X
Highlights

'బాహుబలి' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అప్పటినుండి అన్నీ ప్యాన్-ఇండియన్ సినిమాలే...

'బాహుబలి' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అప్పటినుండి అన్నీ ప్యాన్-ఇండియన్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కూడా ప్యాన్ ఇండియన్ సినిమా అని రాజమౌళి స్వయంగా చెప్పారు. బాహుబలి లాగానే ఆర్ ఆర్ ఆర్ సినిమాను కూడా పెద్ద స్కేల్ లో తీస్తున్నానని వెల్లడించారు రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ కు హిందీ లో కూడా విడుదల కానుంది. అంటే ఇది ఎన్టీఆర్ కు మొదటి హిందీ సినిమా అని చెప్పుకోవచ్చు.

ఇంతకుముందు రామ్ చరణ్ హిందీ, తెలుగు భాషల్లో 'తుఫాన్' సినిమాలో నటించాడు. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ఎన్టీఆర్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమా హిందీ విడుదలపై దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ ను బాలీవుడ్ మీడియా ముందుకు తీసుకు రావడానికి కూడా రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ నటించిన సినిమాలు కొన్ని హిందీ లో హిట్ అయ్యాయి. అయినప్పటికీ హిందీ లో డైరెక్ట్ గా నటించడం ఎన్టీఆర్ కు ఇది మొదటిసారి.

Next Story