కొరటాల శివ ని హోల్డ్ లో పెట్టనున్న ఎన్టీఆర్

*కొరటాల శివ ని హోల్డ్ లో పెట్టనున్న ఎన్టీఆర్

Rama Rao
Published on: 30 May 2022 1:47 PM IST
Jr NTR And Koratala Siva Movie Has been Postponed | Tollywood News
X

కొరటాల శివ ని హోల్డ్ లో పెట్టనున్న ఎన్టీఆర్ 

Koratala Siva-NTR: ఈమధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా పనులు మొదలుపెట్టనున్నారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో ఈ సినిమాని మొదలు పెట్టాలని అనుకోవడం లేదట. ఈ మధ్యనే 'ఎన్టీఆర్ గార్డెన్' కి విచ్చేసిన ఎన్టీఆర్ గడ్డంతో కనిపించారు. చూస్తూ ఉంటే ఎన్టీఆర్ ఒక రెండు మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ ను హోల్డ్ లో పెడదామని ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే సెట్స్ పైకి వెళ్ళిల్సింది కానీ చాలా కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కి చాలా సార్లు స్క్రిప్టు విషయంలో మార్పులు చెప్పినట్లు సమాచారం. పైగా ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ ఒక సాలిడ్ స్క్రిప్ట్ తీసుకురమ్మని కొరటాల కి చెబుతున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story