Akkineni Nagarjuna : నాగ్ 'వైల్డ్ డాగ్' లో ఇవి గమనించారా!

Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున.. ఈ పేరుకి ఓ ఇమేజ్ ఉంది.. రొమాంటిక్ స్టార్ గా అయనకో పేరుంది. అయన చేసిన సినిమాలను

Krishna
Published on: 31 Aug 2020 12:39 PM IST
Akkineni Nagarjuna : నాగ్ వైల్డ్ డాగ్ లో ఇవి గమనించారా!
X

akkineni nagarjuna wild dog movie  

Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున.. ఈ పేరుకి ఓ ఇమేజ్ ఉంది.. రొమాంటిక్ స్టార్ గా అయనకో పేరుంది. అయన చేసిన సినిమాలను ఇప్పటివరకూ చూస్తే ఇద్దరు హీరోయిన్ లు కచ్చితంగా ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా నాగ్ ప్రస్తుతం చేస్తున్న 'వైల్డ్ డాగ్' చిత్రం ఉండబోతుంది. తాజాగా అయన పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం.. ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇందులో నాగ్ తో పాటుగా మిగిలిన పాత్రధారులను కూడా పరిచయం చేసారు మేకర్స్..

అయితే మోషన్ పోస్టర్ లో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో వెల్లడించలేదు.. అయితే దీని వెనుక కారణం లేకపోలేదట.. ఈ సినిమాలో అసలు పాటలు ఉండవట.. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఉండదట. సినిమా కథ మొత్తం చాలా సీరియస్ సాగుతుందని తెలిసింది. ఇప్పటివరకు నాగ్ ఇలా చేయడం ఇదే మొదటిసారి.. ఇక విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో కూడా నాగ్ పుల్ ఫేస్ ని రివీల్ చేయలేదు.. గన్ పట్టుకున్న హాఫ్ ఫోటోని మాత్రమే రిలీజ్ చేశారు. ప్రయోగాలు చేయడంలో నాగార్జున చాలా ఆసక్తి చూపిస్తుంటారన్న సంగతి తెలిసిందే కదా..

నాగార్జున హీరోగా కాకుండా అతిథి పాత్రలు పోషించిన నిన్నే ప్రేమిస్తా, అధిపతి, కృష్ణార్జున లాంటి సినిమాల్లో కూడా ఓ హీరోయిన్, ఓ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.. కానీ ఇవేవి లేకుండా నాగ్ మెయిన్ లీడ్ లో ఓ సినిమా చేయడం అంటే విచిత్రమేనని చెప్పాలి. మరి ఇది నాగార్జునకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.. ఇందులో ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది. ఉపిరి, మహర్షి చిత్రాలకి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు నాగ్.. దాదాపుగా 70 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ధియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు.

ఇక ఇదే సినిమా కాకుండా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ ని చేసేందుకు సిద్దం అయ్యారు నాగార్జున . బంగార్రాజు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది. అటు ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు నాగ్ ..

Krishna

Krishna

Next Story