Akkineni Nagarjuna : వైల్డ్ డాగ్ లుక్ తో సప్రైజ్ చేసిన నాగ్!

Akkineni Nagarjuna : వైల్డ్ డాగ్ లుక్ తో సప్రైజ్ చేసిన నాగ్!
x

 'WILD DOG' First Look Motion Poster

Highlights

Akkineni Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు 61 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Akkineni Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు 61 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జునకి అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా నాగార్జున నటిస్తున్న "వైల్డ్ డాగ్" సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో నాగ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజా పోస్టర్‌లో నాగార్జున గన్ గురిపెట్టి సీరియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఎన్‌ఐఏ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా నాగ్‌ కనిపించనున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో ఆకట్టుకున్న అలీ రెజా కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తుంది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. ఉపిరి, మహర్షి చిత్రాలకి కథ అందించిన అహిషోర్‌ సోలోమన్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు నాగ్.. దాదాపుగా 70 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ధియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదే సినిమా కాకుండా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ ని చేసేందుకు సిద్దం అయ్యారు నాగార్జున . బంగార్రాజు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories