Hero Vishal Manager Car Damaged: మరింతగా ముదిరిన వివాదం.. హీరో విశాల్ మేనేజర్ కారు ధ్వంసం!

Hero Vishal Manager Car Damaged: యంగ్ హీరో విశాల్ గత కొంతకాలంగా ఆదాయపు శాఖకు చెల్లిచాల్సిన డీఎస్ ని చెల్లించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Hero Vishal Manager Car Damaged: యంగ్ హీరో విశాల్ గత కొంతకాలంగా ఆదాయపు శాఖకు చెల్లిచాల్సిన డీఎస్ ని చెల్లించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా తన ఆఫీస్ లో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య రూ.45 లక్షలు మోసం చేసినట్టు తేలిందని, ఆమె పై విశాల్ మేనేజర్ హరి స్థానిక సాలిగ్రామంలోని పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై పిర్యాదు చేశాడు... ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన డబ్బులను తన వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్‌లోకి ఆమె బదిలీ చేసినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు హరి.
దీనితో తనపై ఫిర్యాదు చేయడంతో రమ్య ఓ ఛానల్ ద్వారా హీరో విశాల్ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది... విశాల్ మేనేజర్ హరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను కేసులో కావాలనే ఇరికించాలని చూస్తున్నారని, ఇక బయటకు హీరోగా కనిపించే విశాల్ పెద్ద విలన్ అంటూ వాఖ్యలు చేసింది. వారు చేసే విషయాలు తనకి తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, మహిళను కావడం వల్లే తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం వారి నుండి నాకు ప్రమాదం పొంచి ఉందని, తనకి పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది రమ్య..
ఈ క్రమంలో తాజాగా (జూలై 7న) మేనేజర్ హరి యొక్క ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలను పగలగొట్టారు. దీనితో హరి కోడంబాక్కంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో తనకి రమ్యపై అనుమానం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో ఈ వివాదం మరింతగా ముదిరింది.
ఇక అటు విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో 'చక్ర' అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన జెర్సీ ఫేం శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెజీనా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన స్పందన వస్తుంది. ఎం.ఎస్. ఆనందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT