Vishal chakra movie trailer: ఆకట్టుకుంటున్న విశాల్ 'చక్ర' ట్రైలర్!

vishal chakra movie trailer: తమిళ నటుడే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు హీరో విశాల్.. పందెంకోడి, పొగరు, భరణి, అభిమ‌న్యుడు మొదలగు చిత్రాలతో బాగా ఆకట్టుకున్నాడు విశాల్.

Krishna
Published on: 27 Jun 2020 8:59 PM IST
Vishal chakra movie trailer: ఆకట్టుకుంటున్న విశాల్ చక్ర ట్రైలర్!
X

తమిళ నటుడే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు హీరో విశాల్.. పందెంకోడి, పొగరు, భరణి, అభిమ‌న్యుడు మొదలగు చిత్రాలతో బాగా ఆకట్టుకున్నాడు విశాల్.. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో 'చక్ర' అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన జెర్సీ ఫేం శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెజీనా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇక ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. రెండు నిమిషాల ఏడూ సెకండ్స్ ఉన్న ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే... హైదరాబాద్‌ సిటీ మొత్తం హై అలర్ట్‌లో ఉంటుంది అంటూ చిత్ర ట్రైలర్ మొదలవుతుంది.. సైబర్ క్రైమ్ నేపధ్యంలో జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

'కంటికి కనిపించని వైరస్‌ మాత్రమే కాదు.. వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ కూడా ప్రమాదకరమే.. వెల్‌కమ్‌ టు డిజిటల్‌ ఇండియా' అంటూ చెప్పే డైలాగ్ తో చిత్ర ట్రైలర్ ముగుస్తుంది. అయితే ఈ ట్రైలర్ ని చూస్తుంటే గతంలో విశాల్ హీరోగా నటించిన అభిమ‌న్యుడు సినిమా పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి సినిమాని కొత్త తరహాలో ఏమైనా చూపిస్తారా అన్నది చూడాలి మరి! ఇక ఈ సినిమాకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాని దియేటర్లో రిలీజ్ చేస్తారా లేకా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎం.ఎస్‌. ఆనందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


Krishna

Krishna

Next Story