Bandla Ganesh Comments on Mahesh Babu: ఆ పాత్ర అసంతృప్తినిచ్చింది అంటున్న బండ్లగణేష్!

Bandla Ganesh Comments on Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది

Krishna
Published on: 9 July 2020 4:34 PM IST
Bandla Ganesh Comments on Mahesh Babu: ఆ పాత్ర అసంతృప్తినిచ్చింది అంటున్న బండ్లగణేష్!
X
bandla ganesh sensational comments on act on mahesh babu sarileru neekevvaru movie

Bandla Ganesh Comments on Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది... ఇక ఈ సినిమాలో సినీ నిర్మాత బండ్ల గణేష్ నటించిన సంగతి తెలిసిందే.. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్లో బండ్ల జేబు దొంగ క్యారెక్టర్ లో ఎంటరై హీరోయిన్ బ్రదర్ అంటూ మహేష్ బాబుతో ఫైటింగ్ కి సిద్ధమవుతాడు.. పూర్తి ఫన్నీ గా సాగిన ఈ క్యారెక్టర్ బండ్ల గణేష్ కి అసంతృప్తిని మిగిల్చిందట..

తాజాగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న బండ్ల గణేష్ ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సరిలేరు నీకెవ్వరులో తన పాత్ర గురించి చెబుతూ.. దర్శకుడు ఆ పాత్ర చెప్పినప్పుడు చాలా మంచి పేరు వస్తుందని అనుకున్నానని కానీ ఆ సినిమాలో ఆ పాత్ర చేసినందుకు తన అత్మయులే కొంతమంది తనని తిట్టరాని బండ్ల పేర్కొన్నాడు.. ఇక సినిమాల్లో నటించనని, ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ రోల్ చేస్తానని అన్నాడు. ప్రస్తుతం అయితే మేకింగ్ పైన దృష్టి పెట్టినట్టుగా బండ్ల చెప్పుకొచ్చాడు.. ఇక దర్శకుడికి మంచి టాలెంట్ ఉందని, సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీ అంటూ చెప్పుకొచ్చాడు గణేష్!

తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు.

Krishna

Krishna

Next Story