Happy Birthday Allari Naresh : అలాంటి పాత్రలే ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయి

Happy Birthday Allari Naresh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు

Krishna
Published on: 30 Jun 2020 1:22 PM IST
Happy Birthday Allari Naresh : అలాంటి పాత్రలే ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయి
X

Happy Birthday Allari Naresh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు.. అయితే ఇందులో కొందరు తమ టాలెంట్ తో నిలదొక్కుకోగా.. మరికొందరు మాత్రం కనుమరుగైపోయారు. అలా తనుకున్న టాలెంట్ తో అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకొని శభాష్ అనిపించుకున్నాడు యంగ్ హీరో అల్లరి నరేష్..

స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా హీరోగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరినరేష్.. టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో పర్వాలేదనిపించిన నరేష్ .. ఆ తర్వాత ప్రాణం, జూనియర్స్ , తొట్టిగ్యాంగ్ మొదలగు సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నరేశ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన కితకితలు సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు..

ఇక ఇదే సినిమాతో కామెడీ హీరోగా నరేష్ మరింత పేరు సంపాదించుకున్నాడు.. నరేష్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకాన్ని కూడా నిర్మాతలు కల్పించాడు నరేష్.. అలా అతి తక్కువ సమయంలోనే యాబై సినిమాలను కంప్లీట్ చేసుకున్నాడు.. అయితే నరేష్ సోలోగా హిట్ కొట్టి చాలా రోజులైంది.. గతేడాది మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలో రవి అనే ఓ పల్లెటూరి కుర్రాడి పాత్రలో నటించి మెప్పించాడు నరేష్.. ఈ సినిమా నరేష్ కి మళ్ళీ కం బ్యాక్ అనిపించింది..

ప్రస్తుతం అల్లరి నరేష్ విజయ్ కనకమేడల అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నాంది అని ఒక కొత్త సినిమా చేస్తున్నాడు నరేష్... క్రైమ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.. ఈ రోజు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

ఈ సంద్భంగా నరేష్ మాట్లాడుతూ.. మహర్షి సినిమాలో చేసిన సీరియల్ క్యారెక్టర్ వల్లనే నాంది అనే సినిమాలో చేయగలుగుతున్నా అని నరేష్ అన్నారు.. నటుడిగా నీ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు అంటూ ఫస్ట్‌లుక్‌ చూసి ఇండస్ట్రీలోని చాలా మంది అభినందిస్తున్నారని నరేష్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పాత్రలే నాకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయని నరేష్ చెప్పుకొచ్చారు.. పవర్ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుందని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని నరేష్ చెప్పుకొచ్చారు.. ఇక లాక్ .డౌన్ సమయంలో పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సినిమా నరేష్ కి మరింత గొప్ప విజయాన్ని అందించాలని మనము కోరుకుందాం.. అలాగే అల్లరి నరేష్ కి హెచ్ఎంటీవీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది..

Krishna

Krishna

Next Story