'క్రిష్ణ అండ్‌ హిస్‌ లీల' టీజర్‌ రిలీజ్ చేసిన రానా

క్రిష్ణ అండ్‌ హిస్‌ లీల టీజర్‌ రిలీజ్ చేసిన రానా
x
Highlights

గుంటూరు టాకీస్’‌ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా రవికాంత్‌ పేరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రిష్ణ అండ్‌ హీస్‌ లీల’. 'క్షణం’ మూవీతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రవికాంత్‌.. ఓ యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

గుంటూరు టాకీస్'‌ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా రవికాంత్‌ పేరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'క్రిష్ణ అండ్‌ హీస్‌ లీల'. 'క్షణం' మూవీతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రవికాంత్‌.. ఓ యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను హీరో రానా దగ్గుబాటి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ప‍్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. 'క్రిష్ణ ఫస్ట్‌ లవ్‌ సత్య'.. 'రాధ ది అదర్‌ హఫ్‌ ఆఫ్‌ ద క్రిష్ణ' క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ టీజర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసేందుకు చిత్రబృదం సన్నాహాలు చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించినా... కరోనా వ్యాప్తి కారణంగా ధియేటర్లు ఎప్పటికీ తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదలకు నిర్మాతలు మొగ్గచూపింట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు.

ఇక ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వయకామ్‌ 18, సంజయ్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories