Nayanthara: నయన్‌, విఘ్నేష్‌ కరోనా పాజిటివ్ వార్తలపై క్లారిటీ..

కరోనా రోజురోజుకీ విజృంభిస్తోన్న తరుణంలో సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ న్యూస్‌ వైరల్ అవుతుంది.

Samba Siva Rao
Published on: 22 Jun 2020 11:19 AM IST
Nayanthara: నయన్‌, విఘ్నేష్‌ కరోనా పాజిటివ్ వార్తలపై క్లారిటీ..
X

కరోనా రోజురోజుకీ విజృంభిస్తోన్న తరుణంలో సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ న్యూస్‌ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతారకు కరోనా వైరస్ సోకినట్లు సోషల్ మీడియా వార్తలు వైరల్‌గా మారాయి. ఆమెతో పాటు నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్‌కి కూడా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

నయన్ అభిమానులు నిజంగానే వైరస్ సోకిందా? అని నెట్టింట సందేహాలు కురిపించారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెట్టింట్లో వరుస పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో నయన్ టీం రంగంలోకి దిగింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నయన్ టీమ్ స్పష్టం చేసింది.

తన ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై విఘ్నేశ్‌ స్పందించారు. తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. నయన్‌, విఘ్నేశ్‌ సరదాగా డ్యాన్స్‌ చేస్తూ వీడియోను ఇన్స్ట్ గ్రామ్ లో పోస్ట్ చేశారు.

నయనతార ఆరోగ్యంగా ఉందని, అలాంటి పుకార్లను నమ్మొద్దని కోరింది. కాగా తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చెన్నై నగరంలోనూ రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు నగరాన్ని వదిలేసి వెళ్తున్నారు. షూటింగ్ నిలిచిపోయాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story