Godfather: అభిమానులే నా గాడ్‌ఫాదర్స్‌.. వర్షంలోనూ చిరు ప్రసంగం

Godfather: అనంతపురంలో గాడ్‌ ఫాదర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్

Jyothi
Updated on: 29 Sept 2022 8:05 AM IST
Godfather Movie Pre Release Event in Anantapur
X

Godfather: అభిమానులే నా గాడ్‌ఫాదర్స్‌.. వర్షంలోనూ చిరు ప్రసంగం

Anantapur: అనంతపురంలో జరిగిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. అభిమానుల సమక్షంలో జరిగిన ఈవెంట్లో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. సమాజంలో ప్రజాప్రతినిధుల తీరూతెన్నులపై సినిమాలో చెప్పే డైలాగ్‌లను వేదికపై విన్పించారు. కొంతమంది ఎమ్మెల్యేలను దృష్టిలోపెట్టుకుని కాంట్రాక్టర్లపేరుతో దోచుకుంటున్నారని చెప్పే డైలాగ్‌తో ఆకట్టుకున్నారు.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని తనకు అభిమానులే గాడ్‌ఫాదర్‌ అని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. లక్షలాదిమంది అభిమానులు గాడ్ ఫాదర్‌లాంటి వారని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు గాడ్‌ఫాదర్ నినాదాలు చేయడంతో చిరంజీవి స్పందించి అభిమానులను గుండెల్లో పెట్టుకున్నారు.

Jyothi

Jyothi

Next Story