తెరపైకి రియా చక్రవర్తి బయోపిక్

తెరపైకి రియా చక్రవర్తి బయోపిక్
x

Rhea Chakraborty

Highlights

Biopic On Rhea Chakraborty : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ కేసులో కీలక సూత్రదారిగా ఉన్న రియా చక్రవర్తి ఈ నెల 9 న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.

Biopic On Rhea Chakraborty : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ కేసులో కీలక సూత్రదారిగా ఉన్న రియా చక్రవర్తి ఈ నెల 9 న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట్ కి ముందుగా ఆమెను నాలుగు రోజుల పాటుగా విచారిన అధికారులు ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ విచారణలో రియా 25 మంది సెలబ్రేటిల పేర్లను చెప్పినట్టుగా కథనాలు వచ్చాయి. అందులో భాగంగానే నలుగురు హీరోయిన్ లను ఎన్‌సీబీ అధికారులు విచారించారు. ఇలా సుశాంత్ మ‌ర‌ణించిన‌ప్పటి నుండి వార్తల‌లో నిలుస్తూ వ‌స్తున్న రియా ప్రపంచ మీడియా దృష్టిని కూడా ఆక‌ర్షించింది.

అయితే ఈ క్రమంలో రియా చక్రవర్తి పైన బయోపిక్ తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. సినిమాల్లోకి యా చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడం, సుశాంత్ సింగ్‌తో ఆమె ప్రేమ, సుశాంత్‌ మృతి అనంతరం ఆమెపై ఆయన తండ్రి ఆరోపణలు చేయడం, డ్రగ్స్‌ కేసులో అరెస్టు కావడం లాంటి అంశాలను ఇందులో ఉంచనున్నారట..ఇందులో లీడ్ రోల్ ఎవరు పోషిస్తారు మొదలగు లాంటి అంశాలు త్వరలో తెలియనున్నాయి. ఇక సినిమానే కాకుండా ఓ ప్రచురణ సంస్థ రియా చక్రవర్తి బయోపిక్ పై పుస్తకం తీసుకొచ్చేందుకు ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లుగా సమాచారం.. అటు రియా జ్యుడీషియల్ కస్టడీకి అక్టోబరు 6 వరకు పొడిగిస్తూ ముంబై స్పెషల్ కోర్టు వెల్లడించింది.

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబై లోని తన నివాసంలో చనిపోయాడు.. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అని పలువురు కామెంట్స్ చేయడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరియు సంబంధిత మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories