Top
logo

ప్రభాస్ 'సాహో' ప్రమోషన్ ప్లాన్ కి ఇండస్ట్రీ షాక్!

ప్రభాస్
Highlights

20 రోజులు.. నాలుగు మహా నగరాలు.. రెండు దేశాలు.. ఇదీ సాహో ప్రచార వ్యూహం. 300 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతున్న యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ ను భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

20 రోజులు.. నాలుగు మహా నగరాలు.. రెండు దేశాలు.. ఇదీ సాహో ప్రచార వ్యూహం. 300 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతున్న యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ ను భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏర్పాట్లు తెలుసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీ అవాక్కవుతోందట. మూవీ ట్రైలర్ లాంచింగ్ తో ఈ హంగామా మొదలు కాబోతోంది. అక్కడ నుంచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నిన్నటి వరకూ థియేటర్ల సమస్యను అధిగమించడం మీద దృష్టి పెట్టిన చిత్ర బృందం ఆ సమస్య వదిలిపోవడంతో.. సినిమా ప్రమోషన్ పై ఫోకస్ చేస్తున్నారు.

ఈ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఆన్ని చోట్లా తిరగడానికి ప్రత్యెక విమానాన్ని సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నెల 18న రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీ స్థాయిలో వేసిన సెట్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాల భారీగా జరపబోతున్నట్లు సమాచారం. ఈ ఫంక్షన్ కు దక్షిణ భారత సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో పాటు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులను ప్రభాస్ స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ముంబాయ్ లో 'సాహో' వరల్డ్ ప్రీమియర్ షోను ఈ నెల 29న ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రీమియర్ షోకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు అనేకమంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ సెలెబ్రెటీలను కూడ పిలుస్తున్నారని తెలుస్తోంది. తెలుగు హిందీ తమిళ మళయాళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ మూవీ మొదటిరోజు కలక్షన్స్ 200 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోవాలి అన్న లక్ష్యంతో ప్రభాస్ అనుసరిస్తున్న వ్యూహాలను చూసి బాలీవుడ్ టాప్ హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారట.లైవ్ టీవి


Share it
Top