Pages Missing In Sushant Dairy : సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు మిస్

Pages Missing In Sushant Dairy : బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 8 Aug 2020 12:14 PM IST
Pages Missing In Sushant Dairy : సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు మిస్
X
sushanth singh rajput (File Photo)

Pages Missing In Sushant Dairy : బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. ఇక సుశాంత్ కేసు ఇప్పటికీ కీలక మలుపులు తిరుగుతుంది.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు అదృశ్యం అయిన‌ట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. హీరో సుశాంత్ కి రోజు డైరీ రాసే అలవాటు ఉందని అతని సన్నిహితులు చెబుతున్నారు. అయితే మిస్ అయిన ఆ డైరీ పేజీల్లో సుశాంత్ ఏం రాసి ఉంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే బీజేపీ రాజ్యస‌భ స‌భ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయ‌ర్ షెహ‌దాద్ పూనావాలా కూడా డైరీలో పేజీలు మిస్ అయిన విష‌యాన్ని ప్రస్తావించారు.

ఇక సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి శుక్రవారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి(ఈడీ) వచ్చారు. సుశాంత్‌ మరణం కేసు నేపథ్యంలో అతడి బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది. అయితే సుప్రీంలో తన పిటిషన్ తదుపరి విచారణకు వచ్చేవరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్‌ను వాయిదా వేయాలని రియా కోరింది. ఈ అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది.

సుశాంత్ ఖాతాలో కోట్ల రూపాయలు మాయమయ్యానని, తమ కుమారుడి మరణానికి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు కారణమని సుశాంత్‌ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు బీహార్‌ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

Krishna

Krishna

Next Story