Sushant Singh Rajput Death Case:ఈడీ విచారణకు హాజరైన రియా చక్రవర్తి

Arun Chilukuri
Published on: 7 Aug 2020 1:45 PM IST
Sushant Singh Rajput Death Case:ఈడీ విచారణకు హాజరైన రియా చక్రవర్తి
X

Sushant Singh Rajput Death Case: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి శుక్రవారం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి(ఈడీ) వచ్చారు. సుశాంత్‌ మరణం కేసు నేపథ్యంలో అతడి బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది. అయితే సుప్రీంలో తన పిటిషన్ తదుపరి విచారణకు వచ్చేవరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్‌ను వాయిదా వేయాలని రియా కోరింది. ఈ అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది.

ఇవాళ ఉదయం 11.30 లోపు రియా హాజరుకావాలని లేనిపక్షంలో మళ్లీ తాజాగా సమన్లు జారీ చేస్తామని ఈడీ స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆఫీస్‌కు రియా హాజరయింది. సుశాంత్ ఖాతాలో కోట్ల రూపాయలు మాయమయ్యానని, తమ కుమారుడి మరణానికి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు కారణమని సుశాంత్‌ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు బీహార్‌ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story