PUBG Alternative App FAU-G: చైనా 'ప‌బ్జీ' కి బదులుగా అక్షయ్ 'ఫౌజీ' వచ్చేసింది!

PUBG Alternative App FAU-G:  చైనా ప‌బ్జీ కి బదులుగా అక్షయ్ ఫౌజీ వచ్చేసింది!
x
Highlights

PUBG Alternative App FAU-G: ఇటీవ‌ల త‌రుచు భార‌త‌ సరిహద్దులో చైనా ఘర్షణల‌కు పాల్ప‌డుతున్న‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.

PUBG Alternative App FAU-G: ఇటీవ‌ల త‌రుచు భార‌త‌ సరిహద్దులో చైనా ఘర్షణల‌కు పాల్ప‌డుతున్న‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. నిర్ణ‌యం ద్వారా పబ్‌జీ సహా 118 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పాపులర్ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్ అయిన పబ్‌జీ మొబైల్ కూడా ఒకటి. దీంతో పబ్‌జీ లవర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అలాంటి వారికి బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ఒక తీపికబురు చెప్పారు. పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్‌ యాక్షన్‌ గేమ్‌ ఫౌ-జీని తీసుక వ‌స్తున్న‌ట్టు అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేర‌కు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ఉద్యమానికి మద్దతుగా మల్టీప్లేయర్‌ యాక్షన్‌ గేమ్‌ ఫౌ-జీ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌)ని అక్షయ్ కుమార్‌ శుక్రవారం పరిచయం చేశారు. ఈ గేమ్ కు సంబంధించిన‌‌ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్‌ ట్విటర్లో పోస్ట్‌ చేశారు.

గేమ్‌ ద్వారా వినోదం పంచడం మాత్రమే కాకుండా సైనికుల త్యాగాలను కూడా ప్రజలకు తెలియజేస్తామని,ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం 'భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌'కు అందజేస్తామని అక్షయ్ కుమార్ వెల్లడించారు. కాగా ఫౌజీ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ రూపొందించగా అక్షయ్‌ కుమార్ ఫౌజీకి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. స్వదేశీ గేమ్ ను రూపొందుతున్న నేపథ్యంలో గేమ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories