మాకు అనుష్కే కావాలి.. గుణశేఖర్ కి అభిమానులు ట్వీట్స్!

మాకు అనుష్కే కావాలి.. గుణశేఖర్ కి అభిమానులు ట్వీట్స్!
x
Highlights

Fans Tweets To Gunasekhar : టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క శెట్టి... ఆమె చేసిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

Fans Tweets To Gunasekhar : టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క శెట్టి... ఆమె చేసిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా ఆ సినిమాలు అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా పేరును కూడా తీసుకువచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా గుణశేఖర్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే..మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా 'శాకుంతలం' పేరుతో ఒక ఆహ్లాదకర ప్రేమకథని తన కొత్త సినిమాగా తెరకెక్కిస్తునట్టుగా గుణశేఖర్ నిన్న ప్రకటించారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసాడు గుణశేఖర్..

గుణశేఖర్ రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాకి అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఈ సినిమాకి అనుష్కను తీసుకోవాలని గుణశేఖర్ కు ట్వీట్లు చేస్తున్నారు. 'గుణశేఖర్‌ సర్‌.. దయచేసి అనుష్కను హీరోయిన్‌గా తీసుకోండి'.. 'మీ ఈ సినిమాకి మా క్వీన్ సరిగ్గా సరిపోతుంది' అంటూ అభిమానులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని అనుష్క చేయాలనీ కోరుతున్నారు. మరి దీనిపైన అనుష్క, గుణశేఖర్ ఎలా స్పందిస్తారో చూడాలి!

ఇక ఈ సినిమాని గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తుండగా, మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'హిరణ్యకశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేయడం కంటే ముందే ఈ ప్రేమకథ ఉంటుందని గుణశేఖర్ వెల్లడించారు. సినిమాకి సంబంధించిన నటీనటులను త్వరలో వెల్లడిస్తానని గుణశేఖర్ వెల్లడించారు. ఇక అటు నిశబ్దం సినిమా తర్వాత అనుష్క మరో సినిమాకి ఒప్పుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories