హిరణ్యకశ్యపకి బ్రేక్ : 'శాకుంతలం' టైటిల్‌తో గుణశేఖర్ కొత్త సినిమా!

Gunasekhar New Movie : చేసినవి తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకులలో గుణశేఖర్ ఒకరు.. 2015లో రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్ గత నాలుగేళ్ళుగా ‘హిరణ్యకశ్యప’ అనే భారీ పౌరాణిక చిత్రాన్ని చేయడానికి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీ అయిపోయారు.

Krishna
Published on: 10 Oct 2020 11:24 AM IST
హిరణ్యకశ్యపకి బ్రేక్ :  శాకుంతలం టైటిల్‌తో గుణశేఖర్ కొత్త సినిమా!
X

shakuntalam

Gunasekhar New Movie : చేసినవి తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకులలో గుణశేఖర్ ఒకరు.. 2015లో రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్ గత నాలుగేళ్ళుగా 'హిరణ్యకశ్యప' అనే భారీ పౌరాణిక చిత్రాన్ని చేయడానికి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీ అయిపోయారు. అయితే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళాలి ఆనుకున్న క్రమంలో లాక్ డౌన్ రావడంతో అ సినిమాని ఇప్పుడు తెరకెక్కించడం సరికాదు అని భావించి మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా 'శాకుంతలం' పేరుతో ఒక ఆహ్లాదకర ప్రేమకథని తన కొత్త సినిమాగా తెరకెక్కిస్తునట్టుగా గుణశేఖర్ ప్రకటించారు.

రుద్రమదేవి చిత్రం విడుదలై అయిదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అయన ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కిస్తునట్టుగా గుణశేఖర్ వెల్లడించారు. ఈ సినిమాని గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తుండగా, మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'హిరణ్యకశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేయడం కంటే ముందే ఈ ప్రేమకథ ఉంటుందని గుణశేఖర్ వెల్లడించారు. సినిమాకి సంబంధించిన నటీనటులను త్వరలో వెల్లడిస్తానని గుణశేఖర్ వెల్లడించారు.

Krishna

Krishna

Next Story