Director Gunasekhar about Saroj Khan: ఆ పాటకి ఆమె కొరియోగ్రఫీ ప్రాణం పోసింది.. గుణశేఖర్

Director Gunasekhar about Saroj Khan: ఆ పాటకి ఆమె కొరియోగ్రఫీ ప్రాణం పోసింది.. గుణశేఖర్
x
Highlights

Director Gunasekhar about Saroj Khan: బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్(71) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే..

Director Gunasekhar about Saroj Khan: బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్(71) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు నిర్ధారించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలుపుతుంది. స‌రోజ్ ఖాన్‌తో ఉన్న జ్ఞాప‌కాలను ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుంటున్నారు.

అందులో భాగంగానే టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. " మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1998లో వ‌చ్చిన‌ 'చూడాలని ఉంది' సినిమా కోసం స‌రోజ్ ఖాన తో కలిసి పనిచేశాం.. ఈ సినిమాలోని 'ఓ మారియా.. ఓ మారియా' పాటను ఆమెతోనే కొరియోగ్రఫీ చేయించాలని అనుకున్నాం. బాలీవుడ్ లో అప్పుడు ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మాకు డేట్స్ ఇస్తుందా అన్న అనుమానం కూడా ఉంది. ఆ సమయంలో నిర్మాత అశ్విని దత్ గారి రిఫరెన్స్ తో వెళ్లి మాట్లాడాము. హీరో చిరంజీవి అనగానే ఆమె ఒప్పేసుకున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు కొరియోగ్రాఫ‌ర్స్ ఎఫ‌ర్ట్‌ని త‌న డ్యాన్స్ మూమెంట్స్‌తో వంద‌రెట్లు ఎక్కువ చేస్తారు.

తొలిసారిగా పాట విన్న ఆమె మణిశర్మకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. అలాగే ఆ పాటకి తోట త‌ర‌ణి సెట్‌ని బాగా నచ్చి ఆ పాటకు కొరియోగ్రఫీ చేశారు.ఆమె డ్యాన్స్ స్కిల్స్‌కి యూనిట్ స‌భ్యులు షాట్షా ట్‌కి క్లాప్స్ కొట్టేవారు. ఆ పాటకు అప్పుడు మేము బాగా ఎంజాయ్ చేశాం.. అంత‌కంటే ఎక్కువగా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఆ పాటకి ఆమె కొరియోగ్రఫీ ప్రాణం పోసింది.

ఇక ఆ పాట‌ను ప్రభుత్వం కూడా మెచ్చి సరోజ్‌ ఖాన్ కి నంది అవార్డు కూడా ఇచ్చింది. ఆ తరవాత 'అబ్బబ్బా ముద్దు' సాంగ్‌కి కూడా ఆమె కొరియోగ్రఫి ఆమెతోనే చేయించామని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఆ సినిమా సమయంలో ఆమె తనని ప్రోత్సాహం మ‌రువ‌లేనిదని అన్నారు. ఇక ఆమె మరణం ఇండియన్ సినిమాకే తీరని లోటు అని అన్నారు. ఆత్మకు శాంతిచేకూరాల‌ని ప్రార్థిస్తున్నానని గుణశేఖర్ అన్నారు.

చిరంజీవితో పాటుగా సరోజ్ ఖాన్ టాలీవుడ్ లో బాల‌కృష్ణ, వెంక‌టేష్‌, నాగార్జున‌, మ‌హేష్ వంటి టాప్ హీరోల‌తో క‌లిసి పని చేసింది.డోలా రే డోలా, ఏక్ దో తీన్‌, ధ‌క్ ధ‌క్ ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి ఆమెకొరియోగ్ర‌ఫీ చేశారు. స‌రోజ్‌కి భ‌ర్త సోహ‌న్‌లాల్‌, కొడుకు హ‌మీద్ ఖాన్, కూతురు హీనా ఖాన్‌, సుఖైన ఖాన్ ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories