సోనూ సర్.. ఎమ్మెల్యే టికెట్ ఇప్పించండి.. సోనూసూద్ కౌంటర్!

సోనూ సర్.. ఎమ్మెల్యే టికెట్ ఇప్పించండి.. సోనూసూద్ కౌంటర్!
x

Sonu Sood

Highlights

Fan Asks Sonu Sood : సోనూసూద్.. సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు చలించిపోతున్నాడు

Fan Asks Sonu Sood : సోనూసూద్.. సహాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు చలించిపోతున్నాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఓ సొల్యుషన్ లాగా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది వలసకూలీలను వారి వారి స్వస్థలానికి చేర్చి వారి పాలిట దేవుడిగా నిలించాడు.. అంతటితో ఆగకుండా ఇంకా తనకి తోచిన సహాయం చేసుకుంటూ పోతున్నాడు. అయితే తాజాగా ఓ అభిమాని సోనూసూద్ ని వింత కోరాడు.. దానికి అంతే విచిత్రంగా కౌంటర్ ఇచ్చాడు సోనుసూద్..

బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఇప్పించాలని సోనూసూద్‌ను కోరాడు. 'ఈసారి బిహార్‌లోని భగల్‌పూర్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేస్తా. సోనూ సర్ ప్లీజ్.. బీజేపీ టికెట్ ఇప్పించండి' అని కోరాడు. దీనికి స్పందించిన సోనూ.. 'నాకు బస్సు, రైలు, విమాన టికెట్లు బుక్ చేయడం తప్ప వేరే ఏ ఇతర టికెట్లు బుక్ చేయడం తెలీదు బ్రదర్' అని రిప్లై ఇచ్చాడు. సోనూ ఇచ్చిన రిప్లయ్ కి నెటిజన్లు సూపర్ పంచ్ సోనూ అంటూ కామెంట్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.


ఇక సోనుసూద్ ఇటివల పేద విద్యార్దుల కోసం ఓ ప్రత్యేక స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ని రూపొందించిన సంగతి తెలిసిందే.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన విద్యార్దులకి స్కాలర్ షిప్ లు ఇస్తామని సోనుసూద్ ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షలు లోపు ఉన్న కుటుంబాలకి చెందిన, మెరుగైన ఉత్తిర్ణత సాధించిన విద్యార్దులు [email protected] మెయిల్ కి పది రోజుల లోగు వివరాలు పంపాలని సోనూసూద్ వెల్లడించాడు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories