ఎవరు సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టేనా?

అడవి శేష్ హీరోగా నటించిన ఎవరు సినిమా పెద్ద విజయం దిశగా దూసుకు పోతోంది. అడవి శేష్ గత చిత్రాల రికార్డుల్ని తిరగరాస్తోంది ఈ సినిమా.

K V D Varma
Updated on: 20 Aug 2019 3:16 PM IST
ఎవరు సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టేనా?
X

రీసెంట్ గా సైలెంట్ గా విడుదలైన చిన్న సినిమా ఎవరు పెద్ద హిట్ గా నిలిచింది. అడవి శేష్ గత సినిమాలని మించి ఈసినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అదేవిధంగా ఈ సినిమా మీద బయ్యర్లు కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. అందుకే సినిమాని పది కోట్లకు కొన్నట్టు సమాచారం. అడవిశేషు గత సినిమాలకు ఎప్పుడూ ఈ రేంజ్ లో బిజినెస్ జరగలేదు. అంతే కాకుండా శర్వానంద్ సినిమా రణరంగం సినిమా విడుదలవుతున్న రోజునే ఈ సినిమా కూడా విడుదల చేయడమూ సినిమా పై అడవి శేషుకు ఉన్న నమ్మకాన్ని చెబుతోంది. ఈ నేపథ్యంలో సినిమా దాదాపుగా నిశ్శబ్దంగా విడుదలైనా.. నిలకడైన టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమా హిట్ స్థాయిలో నిలబడింది. వీకెండ్ లోపే సినిమా 70 శాతం రికవరీ చేసుకుందని తెలుస్తోంది.

ఇక రణరంగం సినిమాకి బ్యాడ్ టాక్ రావడం ఎవరు సినిమాకి ప్లస్ గా మారింది. కలెక్షన్లు వీక్ డేస్ లో కూడా నిలకడగా ఉండటానికి ఇది దోహదపడుతోంది. దీంతో రెండో వారం పూర్తయ్యేటప్పటికి ఎవరు లభాలలోకి రావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా ఎవరు సినిమా చిన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా అమెరికాలోనూ ఎవరు కలెక్షన్లు అదిరిపోయాయి. ఇప్పటికే మూడు లక్షల ఏభై వేల డాలర్లు వసూలు చేసిందని తెలుస్తోంది. దీంతో సినిమా సినిమాకీ అడవి శేష్ గ్రాఫ్ పెరుగుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


K V D Varma

K V D Varma

Next Story