Top
logo

మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే!

మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే!
Highlights

సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు నటీనటులు కలిసి వరుసగా హిట్ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్యలో ఎదో ఉందని గాలివార్తలు పుట్టించడం సహజం.దానికి పెళ్ళైన వారు, కాని వారు అనే బెధమూ ఉండదు. కానీ, ఆ ఇద్దరూ పెళ్లి కానివారైతే మాత్రం ఇక ఆ పుకార్లు బీభత్సంగా షికార్లు చేస్తాయి. ఇప్పుడు ప్రభాస్, అనుష్కలకు సంబంధించి అదే జరుగుతోంది.

ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇక అనుష్క కూడా అంతే. ఇద్దరూ సినిమాల్లో తమకంటూ ఓ పెద్ద ఫాలోయింగ్ ను కష్టపడి నిర్మించుకున్నారు. ఇద్దరికీ చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ప్రభాస్ లానే అనుష్క కూడా ఎక్కువగా మాట్లాడరు. సాధ్యమైనంత వరకూ లో ప్రొఫైల్ లోనే ఉంటారిద్దరూ. ఇద్దరి కెరీర్ సమాంతరంగా నడిచి.. బాహుబలి సినిమాతో పీక్స్ కి వెళ్ళిపోయింది. మిర్చి.. బాహుబలి ఈ రెండు సినిమాలకీ మధ్య.. ప్రభాస్ కీ అనుష్కకీ ముదిపెట్టేశారు మన సినీ జనాలు.. అభిమానులు.. ఇంకేముంది బాహుబలి అవుతూనే ఇద్దరికీ పెళ్లి అంటూ ముహూర్తాలు పెట్టేశారు. అసలు వాళ్ళిద్దరూ నోరు మెదపకపోయినా.. ఇదిగో..అదిగో అనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అనుష్కని అందరూ అడిగే ధైర్యం చేయలేదు .. అడగడానికి ఆమె దొరకలేదు కూడా. కానీ పాపం ప్రభాస్.. సాహో సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నాడు. దీంతో అందరికీ అవకాశం దొరికింది. సాహోలో నేనిలా అని ప్రభాస్ చెప్పడం మొదలెట్టేలోపు.. 'మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా?' ఇవే ప్రశ్నలు బాణాల్లా వదిలేస్తున్నారు ఇటు మీడియా, అటు అభిమానులు. అక్కడికీ కాదు బాబోయ్.. అదేమీ లేదు అంటూ ప్రభాస్ ఓపిగ్గా చెప్పుకుతూ వస్తున్నారు. అయినా సరే ఎక్కడా వదలటం లేదు.

సరిగ్గా మళ్ళీ తాజాగా కూడా ఇటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి ఓ మీడియా సమావేశంలో ప్రభాస్ కి దాంతో ఆయనకి ఎక్కడో కాలింది. ఎప్పుడూ మెల్లగా మాట్లాడే ప్రభాస్.. ఒక్కసారిగా గొంతు మారింది. "ఈ వదంతులకు ఫుల్‌స్టాప్‌ పడాలంటే అనుష్క అయినా త్వరగా పెళ్లిచేసుకోవాలి. లేదా నేనన్నా ఓ ఇంటివాడిని అవ్వాలి. ఈసారి అనుష్కను కలిస్తే త్వరగా ఎవర్నో ఒకరిని చూసుకుని పెళ్లిచేసుకోమని చెబుతాను. అప్పుడే మా ఇద్దరి మధ్య ఇలాంటి వదంతులు రాకుండా ఉంటాయి. మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మాకు నిజం దాచాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఇక నేనేం చేయలేను. అసలు ఇలాంటి రూమర్స్‌ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. బహుశా నాకు త్వరగా పెళ్లి చేయాలని ప్రజలు అనుకుంటున్నారేమో. అందుకే ఇలాంటి లింక్స్‌ పెడుతున్నారని అనిపిస్తోంది" అంటూ ఒకింత ఘాటుగా సమాధానం ఇచ్చారు.Next Story