RGV Tweet: సూపర్ స్టార్ అంటే అల్లు అర్జున్.. స్టార్ హీరోలకు వర్మ సవాల్

* "పుష్ప" ట్రైలర్ లో అల్లు అర్జున్ నటనపై వర్మ ప్రశంసలు

Sandeep Reddy
Updated on: 7 Dec 2021 3:06 PM IST
Director RGV Praising Allu Arjun and Challenges to Star Heroes Twitter
X

RGV Tweet: బన్నీనే సూపర్ స్టార్.. స్టార్ హీరోలకు వర్మ సవాల్

RGV Tweet: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "పుష్ప". ఇప్పటికే టీజర్ తో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచిన సుకుమార్ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో అల్లు అర్జున్ ని తగ్గేదేలే అన్నట్టుగా వెండితెరపై చూపించబోతున్నాడు. పుష్ప రాజ్ గా బన్నీ నటించిన పాత్ర అటు అభిమానులకే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. పుష్పరాజ్ పాత్రపై తాజాగా వివాదాస్పద దర్శకుడు తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో అల్లు అర్జున్ ని పొగుడుతూనే.. పరోక్షంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రజినీకాంత్ లకు సవాలు విసిరారు.

రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి అస్సలు భయపడని ఒకే ఒక్క సూపర్ స్టార్ అల్లు అర్జున్ అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పాత్రలను పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు,చిరంజీవి, రజనీకాంత్ తదితరులు ఎవరైనా చేయగలరా? అని వర్మ ప్రశ్నించారు. "పుష్ప" అంటే పుష్పం కాదని ఫైర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా ఈ ట్వీట్ చూసి మెగాఅభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ పెట్టాలనే వర్మ చూస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story