Director Rajat Mukherjee dies in Jaipur: రోడ్ ద‌ర్శ‌కుడు ఇకలేరు

Director Rajat Mukherjee dies in Jaipur: బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, అలాగే నిర్మాత రజత్ ముఖర్జీ ఆదివారం మరణించారు.

Raj
By Raj
Updated on: 19 July 2020 2:56 PM IST
Director Rajat Mukherjee dies in Jaipur: రోడ్ ద‌ర్శ‌కుడు ఇకలేరు
X
Director Rajat Mukherjee dies in Jaipur

Director Rajat Mukherjee dies in Jaipur: బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, అలాగే నిర్మాత రజత్ ముఖర్జీ ఆదివారం మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రజత్ ముఖర్జీ ఈ ఉదయం జైపూర్‌లో తుది శ్వాస విడిచారు. ఆయ‌న లేడ‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని న‌టుడు మ‌నోజ్ భాజ్‌పాయ్ అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు..

'నా స్నేహితుడు మరియు 'రోడ్' మూవీ డైరెక్టర్, రజత్ ముఖర్జీ జైపూర్లో అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తరువాత ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు !!! శాంతితో విశ్రాంతి రజత్ !! ఇంకా మనం ఎప్పుడూ కలవలేము.. సినిమాల గురించి చర్చించలేమనే విషయాన్నీ నమ్మలేకపోతున్నాను' అంటూ పేర్కొన్నారు. కాగా మనోజ్ తన 2002 'రోడ్' అనే చిత్రంలో రజత్ తో కలిసి పనిచేశాడు. ఇందులో వివేక్ ఒబెరాయ్, అంటారా మాలి, విజయ్ రాజ్, మక్రాండ్ దేశ్‌పాండే నటించారు.

దర్శకుడు హన్సాల్ మెహతా కూడా రజత్ కు నివాళులర్పించారు. ట్విట్టర్ లో ఇలా రాశారు..'ప్రియమైన స్నేహితుడు కన్నుమూసిన వార్త ఇప్పుడే తెలిసింది. ప్యార్ ట్యూన్ క్యా కియా అలాగే రోడ్ సినిమా డైరెక్టర్ రజత్ ముఖర్జీ చనిపోవడం చాలా బాధాకరం, బొంబాయిలో మా ప్రస్థానం ప్రారంభం అయ్యే సమయంలో పరిచయమైనా స్నేహితుడు ఆయన' అని పేర్కొన్నారు.

Raj

Raj

Next Story