Lawrence Clarity About Chandramukhi 2 : అదంతా ఫేక్ న్యూస్.. లారెన్స్ క్లారిటీ!

Lawrence Clarity About Chandramukhi 2 : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా

Krishna
Published on: 2 Aug 2020 12:01 PM IST
Lawrence Clarity About Chandramukhi 2 : అదంతా ఫేక్  న్యూస్.. లారెన్స్ క్లారిటీ!
X
Raghava Lawrence (File Photo)

Lawrence Clarity About Chandramukhi 2 : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2005 లో విడుదలైంది. తమిళ్ , తెలుగు అని తేడా లేకుండా అన్ని చోట్ల బాగా ఆడింది ఈ సినిమా.. ఇక తమిళనాడులోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు ఆడి రికార్డును నెలకోల్పింది. ఈ సినిమాని ఇప్పటికి టీవీలో వచ్చిన ప్రేక్షకులు చూస్తురంటే అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శకుడు పీ వాసు ఆఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో రజనీకాంత్‌తో పాటుగా లారెన్స్‌ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే చంద్రముఖిగా ఎవరు నటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే జ్యోతికనే ఆ పాత్రను పోషిస్తుందని వార్తలు రాగా తననెవరూ సంప్రదించలేదని జ్యోతిక వెల్లడించారు. ఇక సిమ్రన్‌, కియారా అడ్వాణీ పేర్లు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ దీనిపైన ఎవరు స్పందించారు.

అయితే దీనిపైన దర్శకుడు, కోరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ స్పందించారు. చంద్రముఖి-2లో జ్యోతిక మేడమ్‌, సిమ్రన్‌ మేడమ్‌, కియారా అడ్వాణీలు కీలక పాత్రలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే అదంతా ఫేక్... ప్రస్తుతం సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మాత్రమే జరుగుతుంది. కరోనా పరిస్థితులు తగ్గాక దీనిపైన చిత్రబృందమే ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు లారెన్స్.

Krishna

Krishna

Next Story