రాహుల్ ఎప్పటికైనా ప్రధాని అవుతారు : దీపికా పదుకునే

Deepika Padukone Praising Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతారంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి..

Krishna
Published on: 28 Sept 2020 4:59 PM IST
రాహుల్ ఎప్పటికైనా ప్రధాని అవుతారు : దీపికా పదుకునే
X

rahul gandhi, deepika padukune

Deepika Padukone Praising Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతారంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ వాఖ్యాలను ఆమె 2017లో చేశారు. అయితే ఇప్పుడు వైరల్ అవ్వడానికి కారణం లేకపోలేదు.. బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా అమెను ఎన్‌సీబీ విచారణకి పిలిచింది. దీనితో దీపికాకి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ పైన ప్రశంసలు కురిపించిన ఓ వీడియో నేట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోలో దీపికా పదుకునే మాట్లాడుతూ.. " దేశం కోసం రాహుల్ గాంధీజీ చేస్తున్న పనులు ఆయనను మంచి ఉదాహరణలా నిలుపుతున్నాయని అన్నారు. ఎదో ఒక రోజు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పుకొచ్చింది దీపికా.. రాహుల్ యువతతో బాగా కనెక్ట్ అవుతారని, భవిష్యత్‌లో అతను దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని, తనకు చాలా నమ్మకం ఉందని దీపికా పేర్కొంది. అంతేకాకండా తనకి ఇష్టమైన నేతల్లో రాహుల్‌ ముందుంటారని చెప్పుకొచ్చింది. అదేసమయంలో ఆయన ఫూచరిస్టిక్‌ కూడా అని దీపికా పేర్కొంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విచారణలో ఏడ్చిన దీపికా!

సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహాతో చేసిన వాట్సాప్ చాట్ నిజమే కానీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని హీరోయిన్ దీపికా వెల్లడించిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. ఇక ఈ విచారణలో ఆమె కన్నీరు పెట్టుకుందట.. మరోవైపు దీపికా పదుకొనే కూడా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉంటానని ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం.. దీపికతో పాటు నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లను కూడా ఎన్‌సీబీ అధికారులు. ఈ నలుగురు హీరోయిన్ల స్టేట్ మెంట్లను రికార్డు చేశారు.

Krishna

Krishna

Next Story