షూటింగ్స్ మధ్యలోనే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు.. హీరోయిన్స్ సంచలన ఆరోపణలు!

షూటింగ్స్ మధ్యలోనే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు.. హీరోయిన్స్ సంచలన ఆరోపణలు!
x

sushant singh rajput

Highlights

NCB Interrogation : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది..

NCB Interrogation : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. ఈ విచారణలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనేలు నిన్న ఎన్‌సిబి విచారణకు హాజరయ్యారు. వీరిని ఎన్‌సిబి అధికారులు సుమారుగా అయిదు గంటల పాటుగా విచారించారని తెలుస్తోంది.

అయితే ఈ విచారణలో సుశాంత్ పైన హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుశాంత్ షూటింగ్స్ మధ్యలోనే డ్రగ్స్ తీసుకునేవాడని, క్యారావాన్ లోకి వెళ్లి మాదకద్రవ్యాలు సేవించేవాడని వీరు చెప్పినట్టుగా ఆ వార్తల సారాంశం.. అయితే తాము మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని ఆ ఇద్దరు హీరోయిన్స్ వెల్లడించారట..

దీపిక కన్నీరు!

సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహాతో చేసిన వాట్సాప్ చాట్ నిజమే కానీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని హీరోయిన్ దీపికా వెల్లడించిందట.. ఈ విచారణలో ఆమె కన్నీరు పెట్టుకుందట.. మరోవైపు దీపికా పదుకొనే కూడా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉంటానని ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం..

మొబైల్స్ సీజ్ :

దిపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లకి సంబంధించిన ఫోన్ లను ఎన్‌సీబీ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఫోన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా బీటౌన్ లో ప్రచారం సాగుతుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నలుగురు హీరోయిన్ ల స్టేట్ మెంట్లను రికార్డు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories