డ్రగ్స్ కేసు : నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

డ్రగ్స్ కేసు : నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్
x
Highlights

Drugs Case : డ్రగ్స్ కేసులో విచారణ ఎదురుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లకి సంబంధించిన ఫోన్ లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది.

Drugs Case : డ్రగ్స్ కేసులో విచారణ ఎదురుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లకి సంబంధించిన ఫోన్ లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఫోన్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా బీటౌన్ లో ప్రచారం సాగుతుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నలుగురు హీరోయిన్ ల స్టేట్ మెంట్లను రికార్డు చేసింది.

ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ విచారణలో రియా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది. అందులో భాగంగానే ఈ నలుగురు హీరోయిన్ లను విచారణకి పిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories