Deepika Padukone Demands Huge Remuneration: ప్రభాస్‌ సినిమా కోసం ఆ హీరోయిన్‌ అంత డిమాండ్‌ చేస్తుందా?

Deepika Padukone Demands Huge Remuneration: ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఇ న్ స్టాగ్రామ్ వేదికగా మహానటి సినిమా బాగుందని, మీరు కూడా చూడండి అంటూ ఓ స్టోరీ పెట్టిన సంగతి తెలిసిందే

Krishna
Published on: 15 July 2020 3:31 PM IST
Deepika Padukone Demands Huge Remuneration: ప్రభాస్‌ సినిమా కోసం ఆ హీరోయిన్‌ అంత డిమాండ్‌ చేస్తుందా?
X
Deepika Padukone demanding a whopping amount

Deepika Padukone Demands Huge Remuneration: ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఇ న్ స్టాగ్రామ్ వేదికగా మహానటి సినిమా బాగుందని, మీరు కూడా చూడండి అంటూ ఓ స్టోరీ పెట్టిన సంగతి తెలిసిందే. దీనితో నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుందని గుసగుసలు మొదలయ్యాయి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయినే తీసుకోవాలని మేకర్స్ ముందు నుంచి భావిస్తున్నారు. అందులో భాగంగానే దర్శకుడు నాగ్ అశ్విన్, దీపికా పదుకొనే కి వెళ్లి స్టోరీ వినిపించారని, దీనికి కూడా దీపికాపదుకునే ఓకే చెప్పిందని ఫిలింనగర్లో ఓ న్యూస్ చక్కెర్లు కొడుతుంది..

నాగ్ అశ్విన్ చెప్పిన లైన్ కి ఫిదా అయిన దీపికా పదుకొనే అంతకుముందు సావిత్రి బయోగ్రఫీ గా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా చూసిందని, ఈ సినిమా బాగా నచ్చడంతో నాగ్ అశ్విన్ టేకింగ్ నచ్చి ప్రభాస్ సినిమాకి ఓకే చెప్పిందని టాక్.. అయితే పారితోషికం విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదంట. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలో ఓ సినిమా కోసం హీరోయిన్‌కు ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ దీపిక డిమాండ్‌ చేస్తోందని సమాచారం. అయితే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై సీ అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అటు ప్రభాస్ ప్రస్తుతం సహో సినిమా తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యాం అనే సినిమాను చేస్తున్నాడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది..UV బ్యానర్‌తో కలిసి గోపికృష్ణ బ్యానర్‌పై కృష్ణం రాజు నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story