CPI Narayana: బిగ్‌బాస్‌ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు.. నాగార్జున ఆ డబ్బులు..

Bigg Boss Show: బిగ్‎బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 6 Sept 2022 7:28 AM IST
CPI Narayana Comments On Bigg Boss Show
X

CPI Narayana: బిగ్‌బాస్‌ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు.. నాగార్జున ఆ డబ్బులు..

Bigg Boss Show: బిగ్‎బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్కూ మొహం తెలియని వారందరినీ ఒక ఇంట్లో కట్టిపడేసి కోతుల ఆటలు ఆడిస్తున్నారు. బిగ్ బాస్ షో సామాజిక రుగ్మతన్న ఆయన.. ఈషో చెడు సంకేతాలను చూపించే ఒక దరిద్రపు షోగా అభివర్ణించారు. బిగ్ బాస్ తీసేవారికి తప్ప వేరే ఎవరికి ఉపయోగం లేదన్నారు. నాగార్జున వారి నాన్న నాగేశ్వరరావు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, ఎంతో డబ్బు సంపాదించారు. కానీ ఈ ముదనష్టపు షో డబ్బులు మీకెందుకని ప్రశ్నించారు. డబ్బు వ్యామోహంలో యువత అమూల్యమైన శక్తి సామార్థ్యాలను సమయాన్ని వృధా చేసుకుంటోందన్నారు. బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన సందర్భంగా నారయాణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story