Kangana Ranaut : కంగనాకి 'Y' లెవల్ సెక్యురిటీ!

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ కు Y లెవల్ సెక్యురిటీ ఇస్తున్నట్టుగా కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇటివల కంగనా ముంబై

Krishna
Published on: 7 Sept 2020 1:35 PM IST
Kangana Ranaut : కంగనాకి Y లెవల్ సెక్యురిటీ!
X

Kangana Ranaut

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు Y లెవల్ సెక్యురిటీ ఇస్తున్నట్టుగా కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇటివల కంగనా ముంబై మీదా చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి.. ఆమె వాఖ్యాల పట్ల శివసేన నేతలు ఆమెపైన మండిపడ్డారు. తనని ముంబై లోకి అడుగు పెట్టనివ్వకుండా బెదిరించారని ఆమె పలు ట్వీట్లు చేసింది. అంతేకాకుండా తానూ ఈ నెల (సెప్టెంబర్) తొమ్మిదిన ముంబైకి వస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. దీనితో తనకి సెక్యురిటీ కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరగా కేంద్ర హోం శాఖ సానుకూలంగా స్పందించింది. తనకు భద్రత కల్పించినందుకు హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది కంగనా.. ఇక అంతకుముందు కంగనా తనని ముంబైలో అడుగు పెట్టకుండా ఎవరైనా వచ్చి తనను అడ్డుకుంటారో చూస్తానని ఆమె సవాల్ చేసిన సంగతి తెలిసిందే..

ఇక బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆమె చేసే వాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకి కొన్ని బెదిరింపులు ఎదురయ్యయాని పలు మార్లు వెల్లడించింది. తన ఇంటి సమీపంలో కూడా ఎవరో కాల్పులు జరిగినట్టుగా కంగనా పేర్కొంది. అయితే తాజాగా తనని ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు ఇచ్చారని వెల్లడించింది. ఇక అటు కంగనా ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్నారు.


Krishna

Krishna

Next Story