Prabhas Adipurush : 'ఆదిపురుష్' కి ముందుగా ఆ హీరోని అనుకున్నారట..

Prabhas Adipurush : ఆదిపురుష్ కి ముందుగా ఆ హీరోని అనుకున్నారట..
x

Prabhas Adipurush

Highlights

Prabhas Adipurush : ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సినిమా గురించి చర్చ.. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్)

Prabhas Adipurush : ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సినిమా గురించి చర్చ.. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే భారీ చిత్రం తెరకెక్కబోతుంది.. 'ఆదిపురుష్ ' సినిమా పేరే కాదు.. 'చెడు మీద మంచి సాధించిన విజయం' అనే ట్యాగ్ లైన్‌ కూడా అభిమానుల్లో మ‌రింత ఉత్సహాన్ని రేపుతుంది. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది..

అయితే ఈ సినిమాని ప్రభాస్ కంటే ముందుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌ ని అనుకున్నారట.. ఆయనకి కథ వినిపించగా, అయన నుంచి ఎలా రెస్పాన్స్ రాలేదట. ముందుగా ఈ కథను 'అయోధి' పేరుతో తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. హృతిక్ నుంచి నో రెస్పాన్స్ రావడంతో అదే కథకు 'ఆదిపురుష్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ప్రభాస్‌తో చేసేందుకు మేకర్స్ సిద్దం అయ్యారట.. ఇక ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్..

ఇక ఈ చిత్రంలో ప్రతినాయ‌కుడు రావ‌ణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నారని, ఆ పాత్రలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ న‌టించ‌నున్నార‌ని ప్రచారం జ‌రుగుతుంది. దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం 'తానాజీ'లో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడైన ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్ర పోషించి.. విమ‌ర్శకుల ప్రశంస‌లు పొందారు. అందుకే, రావణుడి పాత్రకు ఆయనైతే న్యాయం చేయగలరని ఓం రౌత్ భావించారట. సైఫ్ కూడా ఈ పాత్ర‌కు ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ సరసన కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్టుగా సమాచారం..

Show Full Article
Print Article
Next Story
More Stories