Bollywood: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
Bollywood: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
Bollywood: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
Nitin Desai: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం అతడు తన స్టూడియోలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి నితిన్ దేశాయ్ తన స్టూడియోకు వెళ్లాడు. అక్కడే ఉరివేసుకుని మరణించినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. గత కొన్ని దశాబ్దాల నుంచి బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా నితిన్ చంద్రకాంత్ దేశాయ్(58) గుర్తింపు తెచ్చుకున్నారు.
లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్ దే చుకే సనమ్ వంటి హిట్ మూవీస్ కు నితిన్ దేశాయ్ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు. 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా ఉన్న నితిన్ దేశాయ్ మృతి వార్త బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు నటులు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.


