కరోనా బారిన పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్

Sameera Reddy: కరోనా వైరస్ సెంకడ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది.

Samba Siva Rao
Published on: 19 April 2021 9:52 AM IST
Sameera Reddy Covid 19 Positive
X

సమీరా రెడ్డి 

Sameera Reddy: కరోనా వైరస్ సెంకడ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. సెలబ్రీటిల నుంచి సామాన్యుల వరకు అందరిని ఈ మహమ్మరి వదలిపెట్టడం లేదు. సెంకడ్ వేవ్ లో చాలా మంది ప్రముఖలు కరోనా బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్ సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని సమీరా రెడ్డి ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'నాకు కరోనావైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూరా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధృడంగా ఉండాలి' అని రాసుకొచ్చింది.

తన పిల్లలు హన్స్‌, నైరాతో కలిసి సందడి చేసే సమీరా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇప్పుడు సడన్‌గా ఆమె కోవిడ్‌ బారిన పడటంతో ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సమీరా రెడ్డి, వ్యాపారవేత్త అక్షయ్‌ వార్డేను 2014లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడమే మానేసింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది సమీరా రెడ్డి. రానా దగ్గుబాటి హీరోగా నటించిన 2012లో 'కృష్ణం వందే జగద్గురుమ్‌' సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ఎన్టీఆర్ నరసింహుడు, ఆశోక్.. చిరంజీవి జైచిరంజీవ చిత్రాల్లో కూడా నటించింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story