రిచాకు క్షమాపణలు చెప్పిన పాయల్‌ ఘోష్‌!

Payal Ghosh Apology To Richa Chadha : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనని లైగింకంగా వేధించాడు అంటూ నటి పాయల్ ఘోష్ ఇటివల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 9 Oct 2020 12:10 PM IST
రిచాకు క్షమాపణలు చెప్పిన పాయల్‌ ఘోష్‌!
X

Payal Ghosh Apology To Richa Chadha : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనని లైగింకంగా వేధించాడు అంటూ నటి పాయల్ ఘోష్ ఇటివల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో నటి రిచా చద్దాపై పాయల్‌ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి అంటూ గత వారం ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు రిచా చద్దా. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా తనను క్షమాపణలు కోరుతున్నట్టుగా నటి పాయల్‌ ఘోష్‌ ముంబై హైకోర్టులో వెల్లడించారు. శుక్రవారం పాయల్‌ తన న్యాయవాది నితిన్‌ పాట్పుట్‌, హైకోర్టు జస్టీస్‌ మీనన్‌తో మాట్లాడుతూ పాయల్‌ రిచాపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదన్నారు. పాయల్,‌ రిచా అభిమాని అని ఆమెను గౌరవిస్తున్నారని అయన వెల్లడించారు. అటు పాయల్‌ క్షమాపణలు స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి ఎలాంటి నష్టపరిహారాన్ని పొందే ఆలోచన లేదని రిచా న్యాయవాది వీరేంద్ర తుల్జాపూర్కర్‌, సవీనా బేడీ సచార్‌లు కోర్టుకు వెల్లడించారు.

దీనికి ముందు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి పాయల్ ఘోష్ అనురాగ్‌ కశ్యప్‌ పైన కీలక వాఖ్యలు చేశారు. ఓ సారి తనతో ఎదో మాట్లాడాలని ఉంది అంటూ అనురాగ్‌ కశ్యప్‌ తనకి ఫోన్ చేశాడని ఆ మరుసటి రోజున ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అనురాగ్‌ కశ్యప్‌ మద్యం తాగి డ్రగ్స్‌ కూడా తీసుకున్నట్లుగా అనిపించిందని వెల్లడించింది. అయితే వెంటనే ఆయన నన్ను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. నా దుస్తులు విప్పబోయాడని చెప్పుకొచ్చింది.. అయితే తానూ ప్రతిఘటించానని వెల్లడించింది..అయితే ఇదంతా ఇక్కడ సాధారణమని చాలా మంది హీరోయిన్ లు తన దగ్గరికి వస్తారని అనురాగ్‌ కశ్యప్‌ వాఖ్యలు చేసినట్టుగా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.. అంతేకాకుండా తాను ఇండస్ట్రీకి ఓ మర్యాదపూర్వకమైన కుటుంబం నుంచి వచ్చానని, తనకి అమితాబ్ అంటే చాలా గౌరవం, ఇష్టమని, ప్రస్తుతం తనకి ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపు ఉందని అనురాగ్ చెప్పినట్టుగా పాయల్‌ అన్నారుఈ సంఘటన జరిగిన సమయంలో అనురాగ్‌, రణబీర్‌ కపూర్‌తో 'బాంబే వెల్వెట్‌' అనే సినిమాని చేస్తున్నట్టుగా పాయల్‌ వెల్లడించారు.

Krishna

Krishna

Next Story