ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు : నటి ఫైర్‌

Huma Qureshi On Anurag Kashyap : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నటి

Krishna
Published on: 22 Sept 2020 5:37 PM IST
ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు : నటి ఫైర్‌
X

Huma Qureshi 

Huma Qureshi On Anurag Kashyap : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నటి పాయల్‌ ఘోష్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనురాగ్‌ కశ్యప్‌ చెప్పి ఇంటికి రమ్మని చెప్పి చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసింది.. ఆమె చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. అయితే తప్ప కంగనా రనౌత్‌ పాయల్‌ ఘోష్‌ కి మద్దతు పలకగా, తాప్సీ పొన్ను, రాధికా ఆప్టే, రామ్ గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా, సుర్వీన్ చావ్లా, టిస్కా చోప్రా, సాయాని గుప్తా మొదలగు వారు మాత్రం దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు మద్దతు పలుకుతున్నారు. తాజాగా నటి హూమా ఖురేషి సైతం ఈ జాబితాలో చేరిపోయారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.

"అనురాగ్ మరియు నేను చివరిసారిగా 2012-13లో కలిసి పనిచేశాము.. అతను నాకు మంచి స్నేహితుడు అంతేకాకుండా ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా.. నాకు తెలిసినంత వరకు అతను నాతో కానీ ఇతరులతో కానీ చెడుగా ప్రవర్తించలేదు. అయినప్పటికీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లు అధికారులకు, పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. ఇక ఈ విషయం పైన నేను స్పందించకూడదు అనుకున్నా.. ఎందుకంటే సోషల్‌ మీడియా యుద్ధాలు, మీడియా విచారణలపై నాకు నమ్మకం లేదు. అయితే ఇందులోకి నా పేరు లాగడం వలన నాకు కోపం వచ్చింది. ఇది నా ఫైనల్‌ రెస్పాన్స్‌ . మళ్ళీ ఈ విషయంలో ఇకపై నన్ను ఎవరూ సంప్రదించవద్దు" అంటూ ఆ లేఖలో పేర్కొంది.



ఇక అనురాగ్‌ తెరకెక్కించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది నటి హూమా ఖురేషి.. అటు అనురాగ్ కశ్యప్ మాజీ భార్యలు ఆర్తి బజాజ్ (విడాకులు 2009లో ) మరియు కల్కి కోచ్లిన్ (విడాకులు 2015లో ) మద్దతు పలికారు.. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో వారు సుదీర్ఘమైన పోస్టులను పెట్టారు.

Krishna

Krishna

Next Story