Sonu Sood with HMTV: సోనూజీ మీకు పాదాభివందనం : రైతుతో లైవ్ లో మాట్లాడిన సోనూసూద్‌

Sonu Sood with HMTV: సోనూజీ మీకు పాదాభివందనం : రైతుతో లైవ్ లో మాట్లాడిన సోనూసూద్‌
x
sonusood with HMTV
Highlights

Sonu Sood with HMTV: తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా సోనూసూద్‌

Sonu Sood Special interview on HMTV: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్‌ అక్కడ ఉంటున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను వారివారి స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట సోను సూద్‌ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ ఇప్పుడు అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు సోనూసూద్.. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన అతనే పేరే వినిపిస్తుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా సోనూసూద్‌ దృష్టికి వచ్చింది. దీనితో ముందుగా సోనూసూద్‌ రేపు ఉదయానికల్లా ఎద్దులు కొనిస్తానని అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఎద్దులు కాదు ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే రైతు ఇంటి ముందు ట్రాక్టర్ పెట్టాడు సోనూసూద్.. అయితే సోనూసూద్ చేసిన ఈ సహాయానికి ఆ రైతు కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

అయితే తాజాగా నటుడు సోనూసూద్ HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతు నాగేశ్వరరావుతో మాట్లాడాడు.. లైవ్ లో నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. నేను నా పిల్లలు కలిసి సోనూసూద్ కి పాదాభివందనం చేస్తున్నాం అని అన్నాడు నాగేశ్వరరావు.. ఇక అయన సినిమాల్లోనే విలన్ గా చూసాం కానీ అయన రియల్ హీరో అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా సమయంలో వలస కార్మికులను అయన బస్సులో ఇంటికి చేర్చిన సహాయం చూసి సెల్యూట్ కొట్టామని అన్నాడు. లైవ్ లో ఒక్కసారి సోనూసూద్ ని కలిసే అదృష్టం వస్తే బాగుండు అని కోరుకుంటున్నట్టుగా వెల్లడించాడు నాగేశ్వరరావు.. ఇక మీరు ఇచ్చిన ట్రాక్టర్ తో పేద రైతుల పొలం దున్నడానికి సహాయం చేస్తానని చెప్పుకొచ్చారు నాగేశ్వరరావు..

ఇక నాగేశ్వరరావు కుతూరు వెన్నల మాట్లాడుతూ మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు అని పేర్కొంది. మీరు ఇచ్చిన ట్రాక్టర్ మాకు చాలా నచ్చిందని, అవకాశం వస్తే కలుసుకోవాలని ఉందని పేర్కొంది. మరికొన్ని రోజుల్లో తిరుపతికి వచ్చినప్పుడు కచ్చితంగా కలుస్తానని అంతేకాకుండా భోజనం కూడా చేస్తానని హామీ ఇచ్చారు సోనూసూద్.. ఇక నాగేశ్వరరావు, వెన్నల మాటలకి ఎంతో సంతోషించిన సోనూసూద్ మాట్లాడుతూ..మీరు మరికొందరికి సహాయం చేయాలనీ కోరుకుంటున్నట్టుగా వెల్లడించాడు సోనూసూద్..




Show Full Article
Print Article
Next Story
More Stories