Sonu Sood Helps Sofware Engineer Sarada: 'సాఫ్ట్‌వేర్ శారద' పైన స్పందించిన సోనూసూద్!

Sonu Sood Helps Sofware Engineer Sarada: సాఫ్ట్‌వేర్ శారద పైన స్పందించిన సోనూసూద్!
x
actor sonu sood responds over software engineer sarada
Highlights

Sonu Sood Helps Sofware Engineer Sarada: లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధి కోల్పోయారు.

Sonu Sood Helps Sofware Engineer Sarada: లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధి కోల్పోయారు. అందులో భాగంగా వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి హైదరాబాదులో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. అయినప్పటికీ తానూ మాత్రం దైర్యాన్ని కోల్పోలేదు. కుటుంబ పోషణకి గాను మార్కెట్‌లో ఉండి కూరగాయల వ్యాపారం చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మీడియా అనేక రకాల కథనాలని వెల్లడించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది పలువురు రాజకీయ నాయకులు ఆమెను పలకరించారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. అంతేకాకుండా ప్రభుత్వం తరుపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఈ కథనం పైన నటుడు సోనూసూద్‌ స్పందించాడు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని బస్సులని, విమానాలను ఏర్పాటు చేసి వారిని వారి సొంత గ్రామాలకు చేర్చాడు. తాజాగా సాఫ్ట్‌వేర్‌ శారదకు సహాయం చేసేందుకు ముందుకువచ్చాడు. ఆమె ఫోన్ నెంబర్ వివరాలు అడిగి తెలుసుకున్న సోనూసూద్ ఆమెకి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ఉద్యోగం పోతే మానసికంగా ఎంతో క్రుంగిపోతున్న చాలా మందికి శారద ఆదర్శం అని చెప్పాలి. ఎలాంటి నమోషీ లేకుండా ధైర్యంగా ఏదో ఒక పని చేసుకుంటున్న ఆమె కుటుంబాన్ని పోషించాలని అనుకోని ఆమె తీసుకున్న నిర్ణయానికి మనం అభినందించాల్సిందే..

ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు. తండ్రి కష్టాన్ని చూసి తట్టుకోలేక కుమార్తెలే కాడెద్దులుగా మారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి చలించిపోయిన సోనూసుద్ సదరు రైతుకు ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన రెండు గంటల్లోనే రైతు ఇంటి ముందు ట్రాక్టర్‌ ఉండడం విశేషం..

Show Full Article
Print Article
Next Story
More Stories