Bigg Boss3 Telugu: అదే పని బాబా చేసుంటే ఏంచేసేదానివి వితికా.. నాగార్జున క్లాస్!

Bigg Boss3 Telugu: అదే పని బాబా చేసుంటే ఏంచేసేదానివి  వితికా..  నాగార్జున క్లాస్!
x
Highlights

ఏంటమ్మా వితిక ఏమిటా పని అంటూ నాగార్జున గట్టిగానే వేసుకుంటున్నారు. అవును.. గేమ్ ఆఫ్ మేడాలియన్ లో భాగంగా వితిక, బాబా భాస్కర్ ల మధ్య జరిగిన రిక్షా...

ఏంటమ్మా వితిక ఏమిటా పని అంటూ నాగార్జున గట్టిగానే వేసుకుంటున్నారు. అవును.. గేమ్ ఆఫ్ మేడాలియన్ లో భాగంగా వితిక, బాబా భాస్కర్ ల మధ్య జరిగిన రిక్షా టాస్క్ లో వితిక బాబాను కిందకి తోసేసి విజేతగా నిలిచింది. దీంతో నెటిజన్లకు పిచ్చ కోపం వచ్చింది. ఇక ప్రేక్షకులు కూడా వితిక ప్రవర్తనపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అందరూ విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) ఎపిసోడ్ లో నాగార్జున హోస్ట్ గా వస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసింది స్టార్ మా.. ఇందులో నిన్న జరిగిన సంఘటనపై నాగ్ వితికాను నిలదీస్తున్నారు. సింపుల్ గా ఇలా తోసేసావ్ అని యాక్షన్ చేసి మరీ చూపించి వితిక చేసిన తప్పు చెప్పారు. కానీ, దానికి వితిక సార్.. నేను ఆడపిల్లని.. బాబా టాయిలెట్ పని అక్కడ పూర్తి చేసేస్తే.. మళ్ళీ ఇంకో రోజు ఉండగలరు. కానీ, నేను అక్కడ ఆపని చేయలేను కదా.. అందుకే తోసేశాను అని సమర్థించుకుంటూ మాట్లాడింది. కానీ అక్కడ ఉన్నది నాగార్జున.. నిజమే.. నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. కానీ, నువ్వు చేసిన పని బాబా చేసుంటే.. నువ్వు ఇదే ఆడపిల్ల కార్డువని తీసే దానివి కాదా అంటూ సూటిగా సుత్తిలేకుండా అడిగేశారు. దాంతో, వితిక షాక్ తో మాట్లాడలేకపోయింది.

మొత్తమ్మీద నాగార్జున ఈ విషయంలో ఎదో కెలికినట్టే కనిపిస్తోంది. మరి ఇది నిజంగా బాబాకు న్యాయం చేయడానికా.. లేకపోతె, జనాలను మళ్ళీ వెర్రివాళ్లను చేయడానికా అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories